రాయికల్
రెడ్డి జన సంక్షేమ సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి ఏకగ్రీవం

viswatelangana.com
September 3rd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజి పేట్ గ్రామానికి చెందిన అయిలేని ప్రియాంక కృష్ణ రెడ్డి, రెడ్డి జన సంక్షేమ సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డినీ మర్యాద పూర్వకంగా కలిశారు. దీంతో ఆమెను కండువా కప్పి ఎమ్మెల్సీ ఘనంగా సన్మానించారు. రాయికల్ మండలం నుండి మహిళాగా జిల్లా కమిటీలో స్థానం పొందదం పట్ల గ్రామస్తులు ఆమెను అభినందించారు.



