కాళోజి జయంతి వేడుకలు

viswatelangana.com
ప్రభుత్వ జూనియర్ కళాశాల మెట్ పల్లి యందు జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ ఆర్. వెంకటేశ్వరరావు అధ్యక్షతన కాళోజి నారాయణరావు జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాల, విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని తన కవితల ద్వారా ఎండగట్టిన గొప్ప వ్యక్తి అని . “ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక” అంటూ తెలంగాణ ప్రజలలో చైతన్యాన్ని నింపుతూ తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ఉన్న గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి గోవిందుల వెంకటేష్, మరియు అధ్యాపకులు సిహెచ్ శ్రీనివాస్, జగపతి,శ్రీనివాస్, మహేశ్వరి, నర్సయ్య, సుదర్శన్, స్వర్ణలత, మంజుల, కిరణ్ కుమార్, జాకీర్, జమున, మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు



