కోరుట్ల

కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తిరుమల గంగాధర్ కొంతం రాజం

viswatelangana.com

September 21st, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా కోరుట్ల పట్టణంలో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మూడు తరాల ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారన్నారు. కన్న కలలు తీరకముందే తుది శ్వాస విడిచారని, అనేక ఉద్యమాల్లో క్రియాశీలకంగా నిలిచిన బాపూజీ బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తన సర్వస్వం ధార పోశారన్నారు. తన జీవితకాలం అంత ప్రజల కోసమే పరితపించారని, తెలంగాణ తొలి తరం ఉద్యమకారులు బాపూజీ ఒకరని, తెలంగాణ విముక్తి కల్పించేందుకు నిజాం పాలకులను ఎదిరించారన్నారు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమకారులకు ఆదర్శంగా నిలిచారు. స్వాతంత్ర సమరయోధుడిగా, సీనియర్ నేతగా తన ప్రభావాన్ని చూపగలిగారు వారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ తో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎంఏ నయీమ్, మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు మచ్చ కవిత, కౌన్సిలర్ ఎంబెరి నాగభూషణం, అన్నం అనిల్, ఎంబేరి సత్యనారాయణ, కస్తూరి రమేష్, చిటిమెల్లి రంజిత్ గుప్త, నాయకులు ముల్క ప్రసాద్, గొనె రాజేష్ కన్న, సదుల వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button