రాయికల్

గ్రామాల్లో ఉండలేక పోతున్నాం

viswatelangana.com

January 29th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం గ్రామీణ ఉపాధిహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు ఎంపీడీవో ను కలిసి మేము గ్రామాల్లో ఉండలేక పోతున్నామని, తమను ఉపాధి కూలీలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో మమ్ములను ఎందుకు ఎంపిక చేయలేదని ఎక్కడ కనబడితే అక్కడ దూషిస్తున్నారని వినతిపత్రం అందజేశారు. మీకు ఇష్టమైన వారిని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఎంపిక చేశారని,మేము కూడా ఉపాధిహామీ కూలీకి వచ్చామని,ఎందుకు తమను ఎంపిక చేయలేదని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తమ గోడును వెళ్ళబోసుకున్నారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ…. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 20 రోజులు ఉపాధి హామీ పథకంలో పని చేసి గుంట వ్యవసాయ భూమిలేని నిరుపేద కుటుంబాలకు చెందిన లబ్ధిదారులను గ్రామీణాభివృద్ధి శాఖ ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో ఎంపిక చేశారని,ఫీల్డ్ అసిస్టెంట్లు,మేట్లకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను, మేట్లను ఎవరైనా దూషించిన ఇబ్బందులకు గురి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు గ్రామపంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ల మండల అధ్యక్షులు భూక్యా తిరుపతి, మహమ్మద్ నజీర్, కనికరపు లక్ష్మణ్, మామిడిపెల్లి మహేష్, మల్లేశం, శ్రీనివాస్, నర్సయ్య, తిరుపతి, రవి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button