కళ్యాణ మండపం నిర్మాణానికి విరాళం అందజేత

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని రామాజీపెట్ గ్రామ శ్రీ సీతా రామాలయం లోని కళ్యాణ మండపం నిర్మాణానికి దుబాయ్ వారధి సంఘం సభ్యులు అంత కలిసి 45,500 రూపాయలను విరాళంగా ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశమైన దుబాయ్ కి వెళ్ళిన గ్రామానికి చెందిన యువకులు అంత కలిసి సంఘం గా ఏర్పడి గ్రామంలో పలు ఆద్యాత్మిక, సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగానే గ్రామంలోని శ్రీ సీతా రామాలయం కళ్యాణ మండపం నిర్మాణానికి విరాళం అందజేశారు. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచులు దాసమందం వెంకటేశ్వర్లు, వాసరీ రవి, బెజ్జంకి మోహన్, మాజీ ఎంపీటీసీ ఆకుల మహేష్,మాజీ ఉప సర్పంచ్ లు ఆర్మూరు నరేందర్, జకీలేటి హరీష్ రావు, ఆలయ కమిటీ చైర్మన్ కోల రాజు,వారధి సంఘం సభ్యులు కోల శ్రీనివాస్, తొట్లే విష్ణు, అంబల్ల భూమరెడ్డి, న్యావ నంది రాజ్ కుమార్, రవి, గ్రామ నాయకులు అయిలేని భీమారెడ్డి, గుజ్జుల మోహన్ రెడ్డి, ఎనుగంటి పెద్ద లింబయ్య, దుగ్యాల రాంపతి రావు, ఎనుగంటి శంకర్, దొంగ గంగారెడ్డి, గుజ్జులా కిరణ్ రెడ్డి, ఇద్ధం గంగారెడ్డి, దుబాయ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.



