కొడిమ్యాల రైతు వేదికలో సర్వసభ్య సమావేశం రైతులు

viswatelangana.com
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని గ్రామీణ ప్రాంత రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో తీసుకున్న పంట రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కొడిమ్యాల సింగిల్ విండో చైర్మన్ మేనేని రాజనర్సింగరావు కోరారు. మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో శనివారం చైర్మన్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ రైతులకు కావలసిన ఎరువులు డి ఏ పి,ఎం ఓ పి, కాంప్లెక్స్ యూరియా సరైన సమయంలో అందుబాటులో ఉంచడం జరిగింది. తీసుకున్న పంట రుణాలను సకాలంలో చెల్లించి నట్లయితే సంఘం అభివృద్ధి చెందుతుంది అన్నారు. ఇప్పటివరకు కొడిమ్యాల సింగిల్ విండోలో501,మందికి మూడుకోట్ల 92,లక్షల 79, వేల ఎనిమిది వందల అరవై ఒక్క రూపాయలు మాఫీ అయినట్లు తెలిపారు. మాఫీ కానీ రైతులకు ప్రభుత్వం నుండి మాఫీ అవుతున్నట్లు ఉత్తర్వులు రాగానే మాఫీ వర్తిస్తుందని అన్నారు. గత ఐదు సంవత్సరాల క్రితం 538 మంది లోన్ 44116752 ఉండగా తేది 22.03.2025 వరకు 887 మంది 16,61,44,885 కలవు. సొసైటీ మొత్తం సభ్యుల సంఖ్య 2109 కలరు. ఈ సర్వసభ్య సమావేశంలో సింగిల్ విండో పర్సన్ ఇన్చార్జీలు, సంఘ సభ్యులు, రైతులు, సంఘ కార్యదర్శి వడ్నాల గంగాధర్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు



