కోరుట్ల
కోరుట్లలో అయోధ్య తరహ శ్రీరామ నవమి ఉత్సవాలకి నూతన ఉత్సవ కమిటీ ఏర్పాటు

viswatelangana.com
March 17th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణంలోని శ్రీ సీతారామ దేవాలయంలో అయోధ్య తరహ శ్రీరామ నవమి పండుగను ఘనంగా నిర్వహించుటకు శ్రీ సీతారామ దేవాలయ ఆలయ కమిటీ నూతన ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీరామ నవమి రోజు నుండి మొదలుకొని నవరాత్రులు ప్రతిరోజు శ్రీ సీతారామ కళ్యాణం, యజ్ఞ హోమాలతో ఘనంగా నిర్వహించడానికి కమిటీ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఇట్టి మహోన్నతమైన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి ప్రజలు తన వంతు సహాయ సహకారాలు చేయాగలరని ఆలయ కమిటీ పిలుపునిచ్చారు. ఇట్టి కార్యక్రమంలో కమిటీ సభ్యులు, సీతారామ దేవాలయ చైర్మన్ మురళి, రవి, కటకం సునీల్, రాములు, శివ సాయి కృష్ణ, లక్ష్మీనారాయణ మరియు శ్రీరామ సేన పాల్గొని కొత్త కమిటీ సభ్యులు జక్కుల ప్రసాద్, పీసరి అనిల్, వోడ్నాల రామారావు, కృష్ణ, రవి, పారాయణ కమిటీ సభ్యులను, శ్రీరామ యువసేనను ఎంచుకోవడం జరిగింది.



