రాయికల్
నేటి లేగ దూడలే రేపటి పాడి గేదెలు

viswatelangana.com
March 21st, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
అల్లిపూర్, శ్రీ రామ నగర్ గ్రామంలోని సుమారు 220 పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేసినట్లు అదనపు పశువైద్య అధికారి డాక్టర్ నరేష్ గారు తెలియజేసారు. లేగ దూడల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని రైతులకు సూచించారు. లేగ దూడల ఆరోగ్య సంరక్షణ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే తీసుకోవాలి. పెయ్య దూడలకు సకాలంలో నట్టల నివారణ మందులు, లివర్ టానిక్, విటమిన్ A ఇంజెక్షన్, ఖనిజ లవణ మిశ్రమం అందించాలి. పెయ్య దూడలను సరిగా పెంచినట్లైతే అవి పాడి గేదెలుగా ఎదిగి, పాడి పశువును కొనే అవసరం లేకుండా ఆర్థికంగా రైతులకు తోడ్పడతాయి. ఈ కారక్రమంలో రైతులు మల్లేష్, చంద్ర గౌడ్ , వెంకట సుబ్బా రాయుడు, రాజా లింగం, గణేష్ తదితరులు పాల్గొన్నారు.



