కోరుట్ల
కోరుట్ల ఎమ్మెల్యే ప్రభుత్వ ఆస్పత్రిలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీతో ప్రత్యేక సమావేశం

viswatelangana.com
March 29th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్ ఈ సందర్బంగా అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి నూతన భవనం గురించి అసెంబ్లీలో చర్చించానని, త్వరగా పనులు పూర్తీ చేయాలని తెలిపారు.. టీజిఐఐసి అధికారులతో మాట్లాడి త్వరగా ఆక్సిజన్ ప్లాంట్ ఇన్స్టాల్ చేయాలని కోరారు.. ఆసుపత్రికి వచ్చే ఏ పేషెంట్ కు ఇబ్బంది లేకుండా చూడాలని తెలిపారు. త్వరలో ఆరోగ్యశాఖ మంత్రిని కలిసి ఆసుపత్రికి అవసరమయ్యే శానిటేషన్ స్టాఫ్ ను నియమించాలని కోరుతానని తెలిపారు. డయాలసిస్ పేషెంట్లకు ఎటువంటి ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీ సూపర్డెంట్ తో మాట్లాడి బిడిఎస్ దంత వైద్యులు ఉన్నందున వారికి అవసరమయ్యే పరికరాలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో హాస్పటల్ సూపర్డెంట్ డాక్టర్ సునీత, డాక్టర్ లక్ష్మీ, డాక్టర్ వినోద్ పాల్గొన్నారు…



