ఛత్రపతి శివాజి జయంతి వేడుకల్లో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు
viswatelangana.com
కోరుట్ల ప్రతినిధి: కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామంలో గ్రామ యువత అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజి జయంతి వేడుకల్లో ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు పాల్గొన్నారు. అనంతరం జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ ఛత్రపతి శివాజి ఆశయ సాధనకు ప్రతి ఒక్క యువత కృషి చేసి ఆయన అడుగు జాడల్లో నడవాలని అన్నారు. అనంతరం విగ్రహ దాత బద్దం తిరుపతి రెడ్డి కి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ గ్రామ ఉప సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి కోరుట్ల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొంతం రాజం కోరుట్ల నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి కోరుట్ల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమండ్ల సత్యనారాయణగ్రామ శాఖ అధ్యక్షులు సహదేవ్ గంగాధర్ హరీష్ బద్దం నారాయణశేఖర్, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తేలు రాజ్ కుమార్ రామ్ రెడ్డి రాజేష్ మహేష్ సాయి మహేష్ శ్రీను వివేక్ అశోక్ ప్రశాంత్ సుమన్ సంజీవ్ అభిలాష్ గంగ చారి శరత్ గణేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలుయూత్ సభ్యులు పాల్గొన్నారు.



