కోరుట్ల డిపోలో డ్రైవర్స్- డే కార్యక్రమం.. గులాబీ పువ్వులతో డ్రైవర్ లకు అభినందనలు
viswatelangana.com
కోరుట్ల డిపో లో డ్రైవర్స్ డే కార్యక్రమాన్ని డిపో గ్యారేజీలో నిర్వహించరు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోరుట్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రంజిత్ రెడ్డి మరియు కోరుట్ల ఎస్సై కిరణ్ కుమార్ హాజరై.. డ్రైవర్ సోదరులు వారి యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టి ఎంతోమందిని వారి యొక్క గమ్యస్థానానికి సురక్షితంగా చేరవేస్తున్నారు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ డ్రైవర్లకు తగిన సలహాలు సూచనలు చేసి ప్రమాదాలను అరికట్టాలని సూచించరు అలాగే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన డ్రైవర్లను గులాబీ పువ్వుతో అభినందించి శాలువాతో సత్కరించి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ జి.పి.సింగ్ నాయక్ మెకానికల్ అసిస్టెంట్ ఫోర్ మెన్ ఐ ఆర్ కే రెడ్డి టిఐ2 ప్రమీల సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ సాగర్ గారు మరియు సూపర్వైజర్లు కండక్టర్లు డ్రైవర్లు మెకానిక్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు




