viswatelangana.com
Date of Publish : 02 July 2025, 3:18 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
కోరుట్ల త్రిశక్తి మాత ఆలయంలో ఆషాడ మాసం అమ్మవారికి బోనాలు

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గణేశ నవదుర్గ మండలి ఆధ్వర్యంలో త్రిశక్తి మాత ఆలయంలో ఆషాడ మాసం సందర్భంగా సోమవారం రోజున అమ్మవారికి అంగరంగ వైభవంగా బోనాలు సమర్పించారు. ఉదయం అమ్మవారికి పంచ అమృతాలతో అభిషేకాలు నిర్వహించారు. డప్పు చప్పులతో అంగరంగ వైభవంగా మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనాల నైవేద్యం సమర్పించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో ప్రతిరోజు భక్తులు వచ్చి తమ కోర్కెలు తీర్చాలని కోరుకున్న భక్తుల కోరికలు తీర్చిన అమ్మవారికి భక్తితో నైవేద్యంగా బోనం సమర్పించుకున్నారు. కోరుట్ల పట్టణంలో పంటలు సమృద్ధిగా పండాలని ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అందరి పట్ల అమ్మవారి దయ ఉండాలని భక్తులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గణేశ నవదుర్గ మండలి గౌరవ అధ్యక్షులు కట్ట నారాయణ, అధ్యక్షులు కటుకం గణేష్ ప్రధాన కార్యదర్శి గజ్జెల శంకర్ కోశాధికారి అడువాల ప్రభాకర్, కార్యవర్గ సభ్యులు గాజుల రమేష్, లక్కంపల్లి విజయ్, నవీన్ కార్యకర్తలు కటుకం గంగారాం, చింతకింది సత్యనారాయణ, కార్తీక్, ప్రవీణ్, రాము, కళ్యాణ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Change News Type