కడమెడ కళాసాహితి ఆధ్వర్యంలో కవిలు సమ్మేళనం సన్మానం

viswatelangana.com
కొడిమ్యాల మండల కేంద్రంలోని అక్షయ గార్డెన్ లో సోమవారం రోజున కడమెడ కళాసాహితీ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా కవులు, కళాకారులు ఉగాది పండుగ సందర్భంగా తమ కవిత్వాలు చదివి వినిపించారు. ముఖ్య అతిథులుగా వచ్చిన రిటైర్డ్ ఉపాధ్యాయులు మాట్లాడుతూ కవి తన కవిత్వాన్ని సమాజాన్ని మంచి తోవలో నడిచే విధంగా కవిత్వాలు రాయాలని, సాంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా కవులు కవిత్వాన్ని రాయాలని ఈ సందర్భంగా కవులకు సూచన చేశారు. కవి సమ్మేళనం లో పాల్గొన్న కవులకు సన్మానం చేసి, ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం స్వీట్స్ పంపించేశారు.ఈ కార్యక్రమంలో కడమెడ కళా సాహితీ గౌరవ అధ్యక్షులు పర్లపెల్లి జితేందర్, అధ్యక్షులుమల్లారపు రాజయ్య, ఉపాధ్యక్షులు బొమ్మ సురేష్,ఏనుగు ఆదిరెడ్డి,ప్రధాన కార్యదర్శి ఇనుగంటి సత్యానందం, కార్యదర్శి నాంపల్లి శ్రీనివాస్, సలహాదారుడు గడ్డం చంద్రమోహన్ రెడ్డి, జ్యోతిష్య పండితులు తుమ్మనపల్లి పూర్ణచందర్, రిటైర్డ్ ఉపాధ్యాయులు సముద్రాల రామాచార్య, నాంపల్లి రామయ్య, కవులు గుగ్గిళ్ళ నాగభూషణ చారి, పెంటమల్లేశం, పెంట అశోక్, తైదల అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.



