కోరుట్ల

కోరుట్ల పురపాలక సంఘ కార్యాలయంలో కౌన్సిల్ అత్యవసర సమావేశం

viswatelangana.com

August 31st, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పురపాలక సంఘ కార్యాలయంలో చైర్ పర్సన్ అధ్యక్షతన శనివారం కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో (37) అంశాలను పొందుపరచగా అందులో (36) అంశాలను కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపినారు. సమావేశంలో ప్రస్తుత వర్షాకాలం దృష్ట్యా పట్టణములోని పలు వార్డులలో విష జ్వరాలు ప్రబలకుండా ఉండుటకు తగు చర్యలు తీసుకోవల్సిందిగా, వార్డు సభ్యులందరు కోరారు.అనంతరం చైర్ పర్సన్ అన్నం లావణ్య మాట్లాడుతూ… వర్షాకాల దృష్ట్యా పట్టణ ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా పారిశుధ్య పనులు అలాగే ఫాగింగ్, బ్లిచింగ్ చేయుటకు చర్యలు తీసుకోవలసినదిగా మున్సిపల్ కమిషనర్ ని ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ అన్నం లావణ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీది పవన్, మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి, డివై. ఈఈ. కె.నాగేశ్వర్ రావు, మేనేజర్ సి హెచ్. శ్రీనివాస్, టి.పి.ఓ ఎ. ప్రవీణ్ కుమార్, జె.ఎ.ఓ వి.శివకుమార్, టి.పి.యస్. రమ్య, ఎ.ఈ. జె. లక్ష్మీ & టి, అరుణ్ కుమార్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు అలాగే ఆఫీస్ సిబ్బంది పాల్గోన్నారు.

Related Articles

Back to top button