కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పేట భాస్కర్ కు ఘన సన్మానం

viswatelangana.com
ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రిసెర్చ్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అవార్డ్ పొందిన సామాజిక ఉద్యమ నాయకుడు పేట భాస్కర్ ను కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొంతం రాజం ఆద్వర్యంలో మండల నాయకులతో కలిసి పేట భాస్కర్ నివాసంలో అభినందనలు తెలియజేశారు. ఈసందర్భంగా కొంతం రాజం మాట్లాడుతూ పేట భాస్కర్ విద్యార్థి దశ నుండే బడుగు బలహీవర్గాల పక్షాన నిలబడడం అది ఇప్పటివరకు కొనసాగించడం భాస్కర్ చిత్తశుద్ధికి నిదర్శనమనిఅన్నారు పలువురు నాయకులు మాట్లాడుతూ పేట భాస్కర్ కి ఈ అవార్డ్ రావడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమం లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యనారాయణ మండల ప్రధాన కార్యదర్శి జనిల్ నియోజక యూత్ అధ్యక్షులు మహిపాల్ రెడ్డీ ఎస్ సి సెల్ కిసాన్ సెల్ అధ్యక్షులు బోల్లే నర్సయ్య మంథని గంగ నర్సయ్య. జక్కుల రాజన్న పలువురు నాయకులు పాల్గొన్నారు.



