కోరుట్ల

కోరుట్ల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఇంద్రాల హరీష్

viswatelangana.com

December 5th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో కోరుట్ల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా జోగన్ పల్లి గ్రామానికి చెందిన ఇంద్రాల హరీష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఇంద్రాల హరీష్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నన్ను పోటీలో ఉంచిన కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ రావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు లకు ధన్యవాదాలు తెలిపారు. నాకు ఓటు వేసి గెలిపించిన కోరుట్ల మండలంలోని యువతకు పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో కోరుట్ల మండలంలో కాంగ్రెస్ పార్టీనీ మరింత బలోపేతం చేస్తూ స్థానిక సంస్థల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేయడానికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు.

Related Articles

Back to top button