కోరుట్ల
కోరుట్ల మున్సిపల్ నూతన కమీషనర్ కు శుభాకాంక్షలు తెలిపిన పేట భాస్కర్
viswatelangana.com
February 20th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల మున్సిపల్ నూతన కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన బట్టు తిరుపతిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించినారు తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్ తెలిపారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో కమీషనర్ తో కలిసి పలు అంశాలపై చర్చించారు. పట్టణంలో పలు విభాగాలలో పని చేసిన ఆనుభవాలతో పట్టణాన్ని శుభ్రంగా తీర్చిదిద్దీ ఆక్రమ నిర్మాణాలపై కొరడా దులిపించాలని రాష్ట్రంలోనే కోరుట్లను ప్రథమ స్థానంలో నిలుపాలని కోరినట్లు పేట భాస్కర్ తెలిపారు. ఈకార్యక్రమంలో కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మణ్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు శనిగారపు రాజేష్ ఉపాద్యక్షుడు శనిగారపు నరేష్ ప్రధాన కార్యదర్శి మోర్తాడ్ రాజశేఖర్ కోశాధికారి చిట్యాల ప్రభాకర్ నాయకులు చిట్యాల లచ్చయ్య, తాళ్లపల్లి రాజ్ తెడ్డు విజయ్ తదితరులు పాల్గొన్నారు.



