
viswatelangana.com
May 13th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పల్లి గ్రామంలో కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి వివిధ పార్టీ లకు నాయకులు, యువకులు ఎన్నికల్లో ఓట్లు వెయ్యడానికి వచ్చిన వారికి పోలింగ్ బూత్ లను తెలియజేస్తూ, వృద్దులకు, వికలాంగులను పోలింగ్ కేంద్రాలకు చేరవేస్తూ వివిధ పార్టీలలో ఉన్నప్పటికీ ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా ఎన్నికలు ముగిసిన అనంతరం అన్ని పార్టీల నాయకులు కలిసి చెట్టు కింద సేద తీరడం వారి మధ్య ఐకమత్యాన్ని తెలియజేస్తుంది. పంతానికి పోకుండా వారి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే వారి ఆలోచనకు హాట్స్హాఫ్.



