కోరుట్ల

మాజీ ఎంపీపీ తో పాటు పలువురిని పరామర్శించిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు

viswatelangana.com

September 26th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు తాటికొండ విష్ణు భార్య మరణించగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, మండలంలోని ఐలాపూర్ లో విష్ణు స్వగృహంలో మాజీ ఎంపీపీ విష్ణుతో పాటు ఇతర కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఇదే గ్రామానికి చెందిన పైడిపల్లి దయాకర్ రావు కోరుట్లలో ఇటీవల మరణించగా దయాకర్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే మండలంలోని సంగేమ్ గ్రామానికి చెందిన కిసాన్ కాంగ్రెస్ నాయకులు పోతుగంటి శంకర్ గౌడ్ తల్లి సోదరుడు ఇటీవల మరణించగా శంకర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావుతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం, మాజీ ఎంపిటిసి పోతుగంటి వెంక గౌడ్, ముంజ రాజా గౌడ్, ఎన్నమనేని రామచంద్రరావు, మహేష్ రెడ్డి, తాటికొండ మోహన్, తదితరులు ఉన్నారు.

Related Articles

Back to top button