సేవలో పోటీ పడుతున్న విజేత యూత్, అనుపథ యూత్

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామంలోని యువతి వివాహానికి విజేత యువజన సంఘం వారు 5000/- ఆర్థిక సహాయం అనుపథ యూత్ వారు 25 కేజీ ల బియ్యాన్ని అందించారు. తాజా మాజీ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ యువకులు తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించారు. విజేత యూత్ వారు నిరుపేద యువతుల వివాహని ఆర్ధిక సహాయం అందించటం చాలా గొప్ప విషయమని ప్రతి ఒకరు స్తోమతకు తగిన సహాయం ఇతరులకు చేయాలని సహాయం చేయటానికి డబ్బే కోలమానం కాదు అని సహాయం చేయాలన్న ఆలోచనే చాలా గొప్పదని మాజీ సర్పంచ్ జక్కుల చంద్ర శేఖర్ సూచించారు. విజేత, అనుపథ యూత్ వారికి యువతి కుటుంబ సభ్యులు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజేత యూత్ అధ్యక్షుడు సోమ రమేష్, మాజీ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, యూత్ సభ్యులు, రఘునందన్, ఆనంద్, రమేష్ బాబు, ప్రసాద్, ప్రహ్లాద హరీష్, సంతోష్ గౌడ్, శేఖర్, సతీష్, నరేష్, లక్ష్మిరాజం లు పాల్గొన్నారు.



