మెట్ పల్లి

కౌన్సెలింగ్ సెంటర్ లు విద్యార్థుల మనోధైర్యాన్ని పెంచుతాయి

viswatelangana.com

September 14th, 2024
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా మెట్ పట్టణంలోని విజేత కౌన్సెలింగ్ సెంటర్ ని పలువురు ప్రముఖులు మెట్ పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల లింబాద్రి, జనరల్ సెక్రటరీ రాంబాబు, సీనియర్ అడ్వకేట్ మగ్గిడి వెంకట నరసయ్య, తెలుగు అకాడమీ రిటైర్డ్ రీసెర్చ్ అధికారి, అడ్వకేట్ డాక్టర్ తుల రాజేంధర్ విచ్చేసి విజేత కౌన్సెలింగ్ సెంటర్ నిర్వాహకుడు, మోటివేషనల్ స్పీకర్ పుప్పాల నవీన్ కుమార్ ను అభినందించారు. వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించాలని, చిన్న చిన్న విషయాలకు కూడా భయపడుతూ ఖచ్చితమైన జీవిత లక్ష్యాన్ని ఏర్పరచుకోలేక మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు. వారిలో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, మనోధైర్యం, లక్ష్యం పట్ల అవగాహన కల్పించడానికి తన వంతు ప్రయత్నంగా పుప్పాల నవీన్ కుమార్ విజేత కౌన్సెలింగ్ సెంటర్ ను ప్రారంభించడం మరియు ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదు అనే పుస్తకం రచించడం చాలా గొప్ప విషయమని, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. అనంతరం పుప్పాల నవీన్ కుమార్ తాను రచించిన పుస్తకాన్ని వారికి అందజేశారు.

Related Articles

Back to top button