రాయికల్

క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైనది కాంగ్రెస్ – ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ

viswatelangana.com

May 9th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

రాయికల్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అరవింద్ ధర్మపురి మద్దతుగా నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కి ముఖ్యఅతిథిగా వచ్చిన అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా మరియు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతు కాంగ్రెస్ దేశ విచ్చినాన్ని కోరుకుంటుందని 60 ఏళ్ళు ఈ దేశాన్ని పట్టి పిడించిన పార్టీ కాంగ్రెస్ అని అరవై ఏళ్ల అవినీతి పాలనకు చరమగీతం పాడి ప్రజలు బిజెపిని గెలిపించిన తర్వాత నరేంద్రమోదీ నాయకత్వంలో అనేక విప్లవత్మక విజయాలు సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగిందని దేశ ప్రజలందరు బిజెపిని మోదీ ని గుండెలల్లో పెట్టుకొని మూడోసారి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని అది సహించలేని ఇటలీ కాంగ్రెస్ అబద్దపు ప్రచారాలు చేసుకుంటు ఒక వర్గానికి కొమ్ముకాస్తుందని మండిపడ్డారు తెలంగాణ కర్ణాటకలో గ్యారంటీలా మోసంతో 420 హామీలతో అధికారంలోకి వచ్చినట్టు దేశంలో కూడా రావాలని పన్నాగాం పన్నుతుందని అన్నారు370 మల్లి అమలు చేసి కాశ్మీర్ ను పాకిస్తాన్ చేతిలో పెట్టాలని చూస్తుందని మన ఐదు వందల ఏళ్ల నాటి కల రామమందిరం నిర్మాణాన్ని కూడా కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుందని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామమందిర తాళం బాబ్రీ చేతిలో పెట్టాలని చూస్తుందని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు ఈ ఎన్నికలతో ఓటుతో బుద్దిచెప్పి బొందపెట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ రావు రాయికల్ పట్టణ అధ్యక్షులు కల్లెడ ధర్మపురి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పడాల తిరుపతి కౌన్సిలర్ కల్లెడ సునీత జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు కొక్కు గంగాధర్ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుర్మా మల్లారెడ్డి జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి సామర్ల అంజలి ఓబీసీ మోర్చా ఆశన్న దళిత మోర్చా అధ్యక్షులు బన్న సంజీవ్ సీనియర్ నాయకులు మచ్చ నారాయణ బూత్ అధ్యక్షులు జిల్లా మరియు పట్టణ పదాధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

Back to top button