క్రిస్టియన్ అసోసియేషన్ సభ్యులు తాసిల్దారును కలిసి వినతి పత్రం సమర్పించారు

viswatelangana.com
జగిత్యాల జిల్లా కొడిమ్యా మండల కేంద్రంలోని క్రిస్టియన్ అసోసియేషన్ సంఘ సభ్యుల సోమవారం రోజున మండల తాసిల్దార్ రమేష్ ను కలిసి కమ్యూనిటీ హాల్ నిమిత్తం సమాధుల స్థలం నిమిత్తం భూమిని కేటాయించాలని వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా క్రిస్టియన్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు బొల్లుమల్ల జీవన్ కుమార్ మాట్లాడుతూ మండల కేంద్రంలో దాదాపుగా 100 సంవత్సరాల పైగా క్రైస్తవ్యం కొనసాగుతుందని అట్టడుగు వర్గాల ప్రజలు మిషన్ బడులకు వెళ్లి విద్య నేర్చుకొనిప్రయోజకులయ్యారని ఇప్పటికి కొడిమ్యాల మండల లోని అన్ని గ్రామాల నుండి మూడు వేల మందికి పైగా విశ్వాసంలో కొనసాగుతున్నారని కమ్యూనిటీ హాల్, సమాధి స్థలాల నిమిత్తం చొప్పదండి నియోజకవర్గం శాసనసభ్యులు మేడిపల్లి సత్యం దృష్టికి కూడా తీసుకుని వెళ్తామని అన్నారు ఈ వినతి పత్ర సమర్పణలో క్రిస్టియన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బల్ల అబ్రహం, కోశాధికారి బొడ్డెల్లి స్టీఫెన్, గౌరవ సలహాదారు లు పర్లపెల్లి ఏలియా, మేరుగు శ్యాంపాల్, రత్నం ఎలీషా, ఆహారోను జాన్సన్ తదితరులు పాల్గొన్నారు



