కోరుట్ల
గడి పాఠశాలను సందర్శించిన మండల నోడల్ ఆఫీసర్ మార్గం రాజేంద్ర ప్రసాద్

viswatelangana.com
September 24th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణ యస్.ఆర్.యస్.పి క్యాంప్ గడి కోరుట్ల పాఠశాలను మండల నోడల్ ఆఫీసర్ మార్గం రాజేంద్ర ప్రసాద్ సందర్శించి విద్యార్థులను చదివించడం, రాయించడం, చతుర్విద ప్రక్రియలు చేయించారు. నోడల్ ఆఫీసర్ విద్యార్థులను ఉద్దశించి ప్రార్థనలో పొడుపు కథలు చెప్పడం, వార్తలు చదవటం, జీకే ప్రశ్నలు అడగటం అభినందనీయం. పాఠ్యాంశం చివరన గల ఎక్సర్సైజ్ చేయించి కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు, ఉపాధ్యాయులు పూర్ణ చందర్, సురేందర్, సురేఖ, ఫాతిమా, ధనలక్ష్మి లు పాల్గొన్నారు.



