కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం…అధైర్య పడకండి అండగా ఉంటాం
ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
viswatelangana.com
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం మల్లాపూర్ మండల వ్యవసాయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరై రాయికల్ పట్టణంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం విప్ కు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడం కోసం గత పది సంవత్సరాలుగా కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని అధైర్య పడకండి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఆలయ కమిటీ,ఇందిరమ్మ కమిటీ లలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రతిపాదించారని, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మరో ప్రతిపాదనతో మార్పులు చేసి బిఆర్ఎస్, ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలను చేర్చారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ విప్ దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత మంత్రులు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కార్యకర్తలకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతానన్నారు.అనంతరం ప్రభుత్వ విప్ ను కార్యకర్తలు సాల్వతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి గుర్రం మహేందర్ గౌడ్, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొయ్యేడి మహిపాల్, నాయకులు బాపురపు నర్సయ్య, ఎద్దండి భూమారెడ్డి, దివాకర్ రెడ్డి, దాసరి గంగాధర్, మున్ను, షకీర్, శ్రీకాంత్, కడకుంట్ల నరేష్, ఇంతియాజ్, రాకేష్ నాయక్, కోడిపెల్లి ఆంజనేయులు, తలారి రాజేష్, గంగారెడ్డి, నరసింహారెడ్డి, గుండేటి ఆనందం, రాజీవ్, శివ, రాజేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.



