కోరుట్ల
బేతాళ స్వామి ఆలయా శిఖర ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న జువాడి బ్రదర్స్

viswatelangana.com
August 30th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణంలోని యెకీన్ పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన బేతాళ స్వామి ఆలయా శిఖర ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. అనంతరం శిఖర ప్రతిష్టాపన మహోత్సవంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు లు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు స్వామివారి ప్రసాదాన్ని జువ్వాడి బ్రదర్స్ కు అందజేశారు. అనంతరం భక్తుల విన్నపం మేరకు ( ఎస్.డి.ఎఫ్) నిధులతో ఆలయ ప్రాంగణంలో బోర్ వేయించడం జరిగింది. అట్టి బోర్ ను జువ్వాడి కృష్ణారావు ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యెకీన్ పూర్ వార్డ్ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, గ్రామ ప్రజలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.



