రాయికల్
గంజాయి నిందితుల అరెస్ట్

viswatelangana.com
March 28th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
గురువారం సాయంత్రం 4.00 గంటలకు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు జగిత్యాల డిఎస్పి రఘుచందర్ పర్యవేక్షణలో రూరల్ సీఐ ఆరిఫ్ అలీ ఖాన్ ఎస్సై అజయ్ మరియు వారి సిబ్బంది రాయికల్ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా కొండూరి రాజేష్ అరుముల్ల సాయికుమార్ స్కూటీపై జగిత్యాల నుండి రాయికల్ వైపు వస్తుండగా కుమ్మరిపల్లి బస్టాండ్ వద్ద వారిని పట్టుకొని విచారించగా వారి వద్ద గల సంచిలో 1.5 కిలోల ఎండు గంజాయి ఉన్నది నిందితుల వద్ద నుండి గంజాయి సెల్ ఫోన్లు స్కూటీని స్వాధీనపరచుకొని విచారించగా వారు చేసిన నేరం ఒప్పుకోవడం జరిగింది



