జగిత్యాల

ఐక్యతతో యాదవ హక్కులు సాధించుకుందాం

యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్

viswatelangana.com

April 10th, 2025
జగిత్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లాలో యాదవులందరం ఐక్యతతో ముందుకు వెళ్లి యాదవ హక్కులు సాధించుకుందామనియాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ అన్నారు..జగిత్యాల మండలం గుల్లపేట గ్రామ యాదవ సంఘ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు యాదవనేని రాజ లింగం యాదవ్, రెబ్బాస్ మల్లన్న యాదవ్, మోతుకు మహేష్ యాదవ్ చిర్రం గంగన్న యాదవ్ లతో కలిసి పాల్గొని సభ్యత్వ నమోదుతో సంఘ బలోపేతం, సమస్యల పరిష్కారం జనాభా ప్రాతి పదికన యాదవులకు దక్కాల్సిన హక్కుల సాధన తదితర విషయాలు చర్చించారు.. అనంతరం గుల్లపేట గ్రామ యాదవ సంఘ సభ్యులు మొత్తం 61 మంది సభ్యత్వం తీసుకోగ వారికి ఇంచార్జిలతో కలిసి సభ్యత్వ రసీదులందించిన జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్..ఈ కార్యక్రమంలో గుల్లపేట గ్రామ యాదవ సంఘసభ్యులు గణవేని తిరుపతి యాదవ్, భూపతి రంజిత్ యాదవ్, గంగుల కొమురయ్య యాదవ్, రాజ కొమురయ్య యాదవ్, దానవేని మహేష్ యాదవ్, దానివేని కొమురయ్య యాదవ్, ముండ్ల మహేష్ యాదవ్, బొడ్డు గంగన్న యాదవ్, ముండ్ల గంగాధర్ యాదవ్, మంచాల గంగన్న యాదవ్, దానవేణి గంగాధర్ యాదవ్. యాదవ సంఘ సభ్యులు పాల్గొన్నారు..

Related Articles

Back to top button