గణేశ్ నవదుర్గ మండలి ఆధ్వర్యంలో దుర్గ నవరాత్రి ఉత్సవాల కరపత్రం ఆవిష్కరణ

viswatelangana.com
గణేశ్ నవదుర్గ మండలి ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలోని త్రిశక్తి మాత దేవాలయంలో నిర్వహిస్తున్న దుర్గ నవరాత్రి ఉత్సవాల కరపత్రాలను కమిటీ సభ్యులు, పాత్రికేయులతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణేశ్ నవదుర్గ మండలి అధ్యక్షుడు కటుకం గణేష్ మాట్లడుతూ గణేశ్ నవదుర్గ మండలి ఆధ్వర్యంలో గత 47 సంవత్సరాలుగా దుర్గ శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు తొమ్మిది రోజుల పాటు శైలపుత్రి అలంకరణ, బ్రహ్మచారి అలంకరణ, చంద్ర ఘంట, కూష్మాండ, స్కంద మాత, కాత్యాయిని, కాళరాత్రి, మహ గౌరీ, సిద్ది ధాత్రి అవతారాలలో భక్తులకు దర్శమివ్వనున్నట్లు ఆయన తెలిపారు. కోరుట్ల పట్టణ, పరిసర ప్రాంతల భక్తులు ఆధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేసి, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గణేష్ నవదుర్గ మండలి అధ్యక్షులు కటుకం గణేష్, ప్రధాన కార్యదర్శి గజ్జల శంకర్, కోశాధికారి ఆడువాల ప్రభాకర్, పూజారి రామ్ శర్మ, సభ్యులు కటుకం గంగారాం, సంకు అశోక్, చింతకింది సత్యనారాయణ, గాజుల రమేష్, చింత కృష్ణ, కటుకం రాజశేఖర్, విజయ్, కార్తీక్, పాత్రికేయ మిత్రులు తదితరులు పాల్గొన్నారు.



