viswatelangana.com
Date of Publish : 18 October 2024, 1:32 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
గణేష్ నవదుర్గా మండలిలో ‘పౌర్ణమి పూజ’

కోరుట్ల గణేష్ నవదుర్గా మండలి ఆద్వర్యంలో జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని త్రిశక్తి మాత దేవాలయంలో గురువారం సాయంత్రం ఘనంగా ‘పౌర్ణమి పూజ’ నిర్వహించారు. త్రిశక్తి మాత దేవాలయంలో నిర్వహించిన దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సహకరించిన దాతలు, పాత్రికేయ మిత్రులను ఘనంగా సత్కరించారు. అనంతరం అమ్మవారి ఓడి బియ్యంతో అన్నప్రసాదం వితరణ జరిపారు. ఈ సందర్భంగా గణేష్ నవదుర్గా మండలి అద్యక్షులు కటుకం గణేష్ మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలు ముగిసిన అనంతరం కోజాగిరి పౌర్ణమి సందర్భంగా ‘పౌర్ణమి పూజ’ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఉత్సవాలకు సహకరించిన
దాతలు, పాత్రికేయ మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గణేష్ నవదుర్గ మండలి అధ్యక్షులు కటుకం గణేష్, ఉపాధ్యక్షులు తాటిపాముల రమేష్, ప్రధాన కార్యదర్శి గజ్జల శంకర్, సహాయ కార్యదర్శి పోతని రాజేశం, కోశాధికారి ఆడువాల ప్రభాకర్, సభ్యులు కటుకం గంగారాం, సంకు అశోక్, కస్తూరి రాజేశ్వర్, గాజుల రమేష్, వేముల నందీశ్వర్, కార్తీక్, విజయ్ తదితరులు ఉన్నారు.

Change News Type