viswatelangana.com
Date of Publish : 30 January 2024, 2:51 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
గద్దర్‌ విగ్రహ ఏర్పాటుకు లైన్‌క్లియర్‌.. స్థలం కేటాయించిన రేవంత్‌ సర్కార్‌

తెలంగాణ ఉద్యమ గొంతుక. బడుగు వర్గాల ఆశాదీపం.. ప్రజాయుద్ధ నౌక గద్దర్‌ విగ్రహ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. తెల్లపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో విగ్రహ ఏర్పాటు కోసం జాగా కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. కొన్నిరోజుల క్రితం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఆ వెంటనే గద్దర్ విగ్రహం ఏర్పాటు కోసం తెల్లాపూర్ మున్సిపాలిటీ ఒక తీర్మానాన్ని చేయడంతో దానిని హెచ్‌ఎండిఏ ఆమోదించింది. విగ్రహ ఏర్పాటు కావల్సిన స్థలం హెచ్‌ఎండీఏ పరిధిలోకి రావటంతో అనుమతులకు కొంత జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఎట్టకేలకు గద్దర్‌ విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం స్థలం కేటాయించటం పట్ల గద్దర్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు

Change News Type