రాయికల్
భూపతిపూర్ వాసికి ఐకాన్ అవార్డు

viswatelangana.com
January 20th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని భూపతిపూర్ గ్రామానికి చెందిన ఊరే నర్సయ్య స్వామి వివేకానంద జాతీయ ఐకాన్ అవార్డుకి ఎంపికయ్యారు. వీరు చేసిన వెదురు కళాకృతులు, పర్యావరణ హితమైన వినాయకుని తయారీకి గాను అభిలాష హెల్పింగ్ హాండ్స్ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా స్వామి వివేకానంద జాతీయ ఐకాన్ అవార్డు అందుకున్నారు. నర్సయ్య మాట్లాడుతూ మీరు మాలాంటి వారిని గుర్తించి సన్మానించటం సంతోషం గాను,మరిన్ని ఆవిష్కరణలు మరింత ఉత్సాహంతో చేయటానికి దోహపడుతుందని అన్నారు.



