రాయికల్
గిరి గ్రామం ధావన్ పల్లి కి మహర్దశ
పీవీటీజీ స్కీంలో ధావన్ పల్లి ఎంపిక కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు

viswatelangana.com
June 15th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
కేంద్ర ప్రభుత్వం గిరిజన గ్రామాల అభివృద్ధికి పీవీటీజీ స్కీం జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ధావన్ పల్లి గ్రామానికి ఈ స్కీం కింద ఎంపిక చేసింది. ఈ గ్రామాని ఐదేళ్లపాటు కేంద్ర ప్రభుత్వం దతత్త తీసుకొని,కేంద్రం ద్వారా వచ్చే ప్రత్యేక నిధులతో గ్రామాలు అభివృద్ధి చెందడంతో పాటు గిరిజనులు ఆర్థికంగా ఎదుగుతారు. గ్రామ శాఖ అధ్యక్షుడు బలరాం నాయక్ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు ఎంపీ అరవింద్ కి పాలాభిషేకం ఘనంగా చేశారు. ఈ కార్యక్రమలో గిరిజన మోర్చా జిల్లా ఉప అధ్యక్షుడు గంగాధర్ నాయక్,గ్రామ ఉప సర్పంచ్ బిక్కు నాయక్, మండల ఎస్టీ మోర్చా అధ్యక్షుడు డా.తిరుపతి నాయక్, గ్రామ ఉప అధ్యక్షుడు రవి, సీనియర్ నాయకులు రాజు నాయక్,రాజు, గంగన్న,దేవందర్ నాయక్,ముఖ్య నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



