viswatelangana.com
Date of Publish : 02 March 2024, 10:05 am Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
గుండె పోటుతో కోరుట్ల ఏఎస్సై మృతి

జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న లోకిని రాజేందర్ (53) గుండెపోటుతో శనివారం తెల్లవారుజూమున మృతి చెందారు. శుక్రవారం విధులు పూర్తిచేసుకుని ఇంటికి చేరుకున్న రాజేందర్ కు రాత్రి 11 గంటల సమయంలో గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. శనివారం వేకువజామున 5 గంటలకు మళ్ళీ రాజేందర్ గుండెపోటుకు గురై మరణించినట్లు తెలిసింది. రాజేందర్ కానిస్టేబుల్గా పోలీస్ ఉద్యోగం ప్రారంభించి హెడ్ కానిస్టేబుల్గా, ఎఎస్సైగా పదోన్నతులు పొందారు. గత రెండు సంవత్సరాల క్రితం ఏఎస్సెగా పదోన్నతి పొంది కోరుట్ల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. రాజేందర్ మృతితో ఎస్సె కిరణ్ కుమార్, స్థానిక పోలీస్ సిబ్బంది నివాళులర్పించారు. రాజేందర్ కు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.

Change News Type