హైదరాబాద్
గుట్కా, పాన్ మసాలాపై ప్రభుత్వం నిషేధం

viswatelangana.com
May 27th, 2024
హైదరాబాద్ (విశ్వతెలంగాణ) :
టొబాకో, నికోటిన్ కలిగిన గుట్కా, పాన్ మసాలా తయారీ, నిల్వ, సరఫరా, రవాణా, అమ్మకంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఉత్తర్వులిచ్చారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 24 నుంచి ఏడాది పాటు నిషేధం అమల్లో ఉంటుందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు



