మెట్ పల్లి
గురుకుల పాఠశాల సందర్శించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

viswatelangana.com
February 22nd, 2025
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :
మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ శనివారం రాత్రి సందర్శించారు. పాఠశాలలోని పరిసరాలు, కిచెన్, వసతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కలెక్టర్ రాత్రి గురుకులంలోనే బస చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో మహేశ్వర్ రెడ్డి, ప్రిన్సిపాల్ మాధవిలత, ఆర్ఐ ఉమేష్, సిబ్బంది పాల్గొన్నారు.



