కోరుట్ల

గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించిన గ్లోబల్ హైట్స్ స్కూల్

viswatelangana.com

July 10th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డులో ఉన్న గ్లోబల్ హైట్స్ స్కూల్‌లో గురువారం గురుపౌర్ణమి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు తమ గురువులను సన్మానించి, వారికి పాదాభివందనాలు చేసి తమ కృతజ్ఞతను వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ గట్ల లక్ష్మి మాట్లాడుతూ, గురువులు దైవస్వరూపులు. వారు జ్ఞాన ప్రసాదకులు. హిందూ సనాతన ధర్మ గురుపరంపర వల్లే విద్యార్థులలో సత్‌గుణాలు, మంచి ప్రవర్తన పెరుగుతుంది, అని తెలియజేశారు.ఈ వేడుకల్లో ఉపాధ్యాయ బృందంతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొంతమంది తల్లిదండ్రులు మాట్లాడుతూ, ఇదే మొదటి విద్యా సంవత్సరం అయినా గ్లోబల్ హైట్స్ స్కూల్ లో పిల్లలకు కేవలం పాఠ్య విద్యే కాకుండా, మన హిందూ ధర్మ సాంప్రదాయాలపై అవగాహన కలిగేలా చదువిస్తోందని. ఇది చాలా స్కూల్ లలో ఉండదని. ఈ స్కూల్‌లో పిల్లల వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన విలువలు బోధిస్తున్నారు, అని ప్రశంసలు కురిపించారు. సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుక విద్యార్థుల్లో గౌరవ భావనను పెంపొందించేందుకు తోడ్పడిందని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.

Related Articles

Back to top button