సాగులో మెలకులపై శిక్షణ

viswatelangana.com
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం జగిత్యాల దత్తత గ్రామమైన రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలోని రైతు వేదికలో వానాకాలం 2025 సాగులో మెలకులపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏడిఆర్ శ్రీలత హాజరయ్యి రైతులు ఒక వరి పంటనే కాకుండా వివిధ రకాల పంటలు సాగు చేసి అధిక లాభాలు పొందాలని సూచించారు. అదేవిధంగా శాస్త్రవేత్తలు వానాకాలానికి వరి మొక్కజొన్న రకాలు వాటి యాజమాన్యం ఎరువుల యాజమాన్యం పసుపు మామిడిలోని యాజమాన్య పద్ధతులు మరియు మార్కెటింగ్ అవకాశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో దత్తత గ్రామ ఇంచార్జ్ డాక్టర్ డి ఏ రజనీ దేవి, శాస్త్రవేత్తలు డాక్టర్ ఇ రజనీకాంత్, డాక్టర్ బి శ్రీనివాస్, డాక్టర్ పి రవి, డాక్టర్ కే స్వాతి, ఏ ఈ ఓ సృజన, ఎఫ్ ఈ ఓ చైర్మన్ అత్తినేని శంకర్ ఎఫ్ ఈ ఓ డైరెక్టర్లు ఓరుగంటి రాజలింగం, బోజ్జా దేవేందర్ రావు,అత్తినేని రాజం, ఎంబారి వెంకటేష్, రైతులు పాల్గొన్నారు.



