గెజిటెడ్ హోదా కల్పించాలి…

viswatelangana.com
భాషాపండితుల పై 2005 లో ఆనాటి ప్రభుత్వం తీసుకవచ్చిన 1/2005 ఆక్ట్ ను రద్దు చేసి భాషోపాధ్యాయులకు నియామకం తేది నుండి స్కూల్ అసిస్టెంట్ హోదా ను వర్తింపజేషి సర్వీస్ ప్రొటెక్షన్ కల్పించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ అధ్యక్షులు యం.డి. అబ్దుల్లా అన్నారు. ఆదివారం రాయికల్ మండల కేంద్రము లో గల జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి వేల్పుల స్వామి యాదవ్ ను స్వగృహంలో కలిసిన సమావేశం లో యం.డి. అబ్దుల్లా మాట్లాడుతూ 24 సంవత్సరా సర్వీసు చేసుకున్న ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులందరికి గెజిటెడ్ హోదా కల్పించాలని దీని ద్వారా ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం ఉండదని అన్నారు. పదోన్నతులు రాకుండా మిగిలిపోయిన సుమారుగా 650 మంది భాషాపండితులకు పదోన్నతులు కల్పించాలని అన్నారు. 1927 ఏర్పడిన రాష్ట్రంలోనే అత్యంత సీనియన్ ఉపాధ్యాయ సంఘమైన రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు కు ప్రభుత్వ గుర్తింపు హోదా కల్పించాలని కోరారు. ప్రాథమిక పాఠశాల ల్లో హిందీని ప్రవేశ పెట్టి ప్రాథమిక పాఠశాల ల్లో తెలుగు హిందీ పండితులను నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కటుకం నరేందర్, చంద సత్యనారాయణ, రాష్ట్ర ప్రతినిధి వంగపల్లి సంపత్ కుమార్, ప్రాథమిక సభ్యులు వేల్పుల స్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.



