viswatelangana.com
Date of Publish : 17 May 2024, 3:45 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
గోపులాపూర్ లో దాడి ఒకరు మృతి – ఇంకొకరు సీరియస్

జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్ లో అర్ధ రాత్రి ఉదయం 12- 1 ఒంటిగంట ప్రాంతంలో దాడి జరిగింది. ఈ దాడిలో గోపులాపూర్ గ్రామంలోని దీటి శ్రీనివాస్ అక్కడిక్కడే మృతి చెందగా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న దీటి మహేష్ వరంగల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ వివాదానికి కారణం ఇల్లు కొనుగోలు విషయంలో జరిగిన పాత గొడవలనీ సమాచారం. ఈ వ్యక్తులను బుర్ర నవీన్ అతని స్నేహితులు కర్రలతో దాడి చేసినట్లు తెలిసింది. పోలీస్ లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు కూడా శుక్రవారం ఉదయం గోపులాపూర్ లోని సంఘటన స్థలాన్ని పరిశీలించి, గ్రామంలో ప్రజలను విచారించి గొడవలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

Change News Type