మేడిపల్లి
గోవిందరం గ్రామంలో ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యుత్ ఘాతానికి గురై బర్రె మృతి

viswatelangana.com
June 3rd, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :
గోవిందారం గ్రామంలో పాడి రైతు గొంటి స్వరూప-స్వామి లకు చెందిన బర్రె ఈరోజు ఉదయం గ్రామంలోని బారియర్ (మందటి) గ్రౌండ్ లో గల సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ ఘాతానికి గురై మరణించడం జరిగింది పేద కుటుంబానికి చెందిన పాడి రైతు గొంటి స్వరూప స్వామిల బర్రె చనిపోవడాన్ని వారు జీర్ణించుకోలేక తీవ్ర దుఃఖానికి లోనై మా జీవనాధారమైన బర్రె విద్యుత్ ఘాతానికి గురై మరణించడంతో ప్రభుత్వం నష్టపరిహారం అందించి మా కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా వేడుకోవడం జరిగింది. వెంటనే సంఘటన స్థలానికి విద్యుత్ అధికారులు, వెటర్నరీ అధికారులు వచ్చి పై అధికారులకు తెలియపరచడం జరిగింది.ఈ సంఘటన ప్రదేశానికి తాజా మాజీ సర్పంచ్ కరండ్ల మధుకర్ ఎంపీటీసీ పూర్ణిమ ప్రభాకర్, వనపర్తి దశరథం, రాగేటి గంగాధర్, పుల్లూరి దేవయ్య, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు వెళ్లడం జరిగింది..



