viswatelangana.com
Date of Publish : 09 September 2024, 8:12 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ కి ఘన సన్మానం
featured

తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గా ఇటీవల ఎన్నికైన డాక్టర్ రియాజ్ కి యునైటెడ్ ముస్లీం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు మొహమ్మద్. ముజాహిద్. ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ మాట్లాడుతూ, తెలంగాణలో ముస్లిం మైనార్టీ సమాజం ఆర్థికంగా, ఉద్యోగ అవకాశాలు లేక, వ్యాపారాల్లో స్తోమత లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయని అదేవిధంగా మైనార్టీ ముస్లింలకు రిజర్వేషన్ మైనార్టీ సబ్సిడీ లోన్ అతి త్వరలో ప్రభుత్వం అమలు చేయాలని. ఈ అంశాలను డాక్టర్ రియాజ్ దృష్టికి తీసుకువచ్చారు. గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ మాట్లాడుతూ, మైనార్టీ హక్కుల పరిరక్షణ కోసం తన ప్రయత్నాలను కొనసాగిస్తానని, సమాజం యొక్క అన్ని వర్గాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సన్మాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల, సంఘ స్థాపకులు & స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి షబ్బీర్, స్టేట్ కోశాధికారి సాదుల్లా. పొలిటికల్ ప్రెసిడెంట్ హమీద్ మరియు వివిధ మైనారిటీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Change News Type