రాయికల్
ఘనంగా కొవ్వొత్తులతో నివాళులు

viswatelangana.com
April 23rd, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణం, రామాజీపేట గ్రామంలో లో పహల్గాం దాడిలో అమరులైన యాత్రికులకు పార్టీలకు అతీతంగా కొవ్వొత్తులతో నివాళులర్పించారు. రాయికల్ బస్టాండ్ నుండి గాంధీ విగ్రహం వరకు బారతమాతకు జై అంటు.. .ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి మనవహరంగా ఏర్పడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.



