మేడిపల్లి

ఘనంగా నిర్వహించిన జడ్పీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు పుట్టినరోజు వేడుకలు

viswatelangana.com

May 24th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామంలో బిఆర్ఎస్ మండల కో ఆప్షన్ షేక్ హైమద్, కెడిసిసి బ్యాంకు డైరెక్టర్ మిట్టపల్లి రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో జడ్పీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, వొద్దినేని హరిచరణ్ రావు రాజకీయ జీవితంలో మరింత ఎదగాలని నిండు నూరేళ్లు ఆయన సంతోషంగా జీవించాలని బిఆర్ఎస్ శ్రేణులు అభిమానులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో షేక్ హుస్సేన్, ముజాహీద్, సజ్జద్ అహ్మద్, షేక్ ఇంతియాజ్, నౌషీర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button