రాయికల్

దివ్యాంగులు మానసికంగా ఎంతో యోగ్యులు

viswatelangana.com

December 4th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

శారీరక వైకల్యాలు ఉన్నప్పటికీ దివ్యాంగులు మానసికంగా ఎంతో యోగ్యులని పాఠశాలసముదాయం ప్రధానోపాధ్యాయులు కాపు శ్రీనివాస్ అన్నారు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాలను పురస్కరించుకొని రాయికల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో బుధవారం మండల సి డబ్ల్యు యస్ యన్ ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, దివ్యాంగులమని నిరాశ పడవద్దని జీవితంలో వైకల్యాన్ని లెక్క చేయక ఎన్నో విజయాలు సాధించిన దివ్యాంగులను ఆదర్శం చేసుకొని తల్లిదండ్రులు దివ్యాంగులైన తమ పిల్లలను ఆదరించి ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్ పెద్దోళ్ళ సృజన ప్రధానోపాధ్యాయులు గట్టు రమేష్ నర్సయ్య ఉపాధ్యాయులు చెరుకు మహేశ్వర శర్మ , లక్కాడి రాజారెడ్డి పుర్రె శ్రీనివాస్ వి.గంగరాజం సిఆర్ పి కె.రవీందర్ యంఆర్సి సిబ్బంది వెంకటేశ్వరరావు దివ్యాంగుల పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button