కోరుట్ల
ఘనంగా సంకు సుధాకర్ 61వ జన్మదిన వేడుకలు, 100 మంది మహిళలకు చీరెల పంపిణీ

viswatelangana.com
May 6th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షులు, ముంబై ఆంధ్రా మహాసభ మాజీ అధ్యక్షులు, కాశీ పద్మశాలి అన్నసత్రము సెక్రెటరి సంకు సుధాకర్ 61వ జన్మదిన వేడుకలు మంగళవారము రోజున సాయంత్రం పట్టణంలోని పద్మశాలి కళ్యాణ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న 100 మంది మహిళలకు సంకు సుధాకర్ చీరెల పంపిణీ చేశారు. అనంతరం విందు భోజనాల ఏర్పాట్లు చేశారు. ఇట్టి కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్ష కార్యదర్శులు, కార్యకర్తలు, పట్టణ ప్రతినిధులు, రాజకీయ నాయకులు, వ్యాపార అధినేతలు, పాత్రికేయులు, పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు, రాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన అభిమానులు, బంధువులు, కుటుంబ సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



