రాయికల్

సంఘ అభివృద్ధికి కృషి చేయాలిమున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లురాయికల్

viswatelangana.com

April 14th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

సంఘం అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు అన్నారు. రాయికల్ పట్టణంలోని మార్కండేయ దేవాలయ పంక్షన్ హాల్ లో ఆదివారం నూతన పద్మశాలి పట్టణ యువజన సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పద్మశాలి అద్యక్షులు రుద్ర శ్రీనివాస్ హజరైనారు. అద్యక్షులుగా సామల్ల సతీష్, ప్రధానకార్యదర్శి గా ఆడేపు రాజీవ్, ఉపాధ్యక్షులుగా ఎలిగేటి సత్యనారాయణ, సింగని సతీష్, సంయుక్త కార్యదర్శులుగా అనుమల్ల చంద్రతేజ, గంట్యాల ప్రవీణ్ లచే ఎన్నికల అధికారి తాటిపాముల రాజకిషోర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవ సంఘం అధ్యక్షులు తాటిపాముల విశ్వనాథం, ప్రధానకార్యదర్శి మామిడాల లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు శ్రీరాముల సత్యనారాయణ, కోశాధికారి నర్సయ్య, గుట్ట సత్యనారాయణ, ఆడేపు నర్సయ్య, బోగ రాము, బీమనాతి నరేష్, సామల్ల గోపాల్, బింగి వెంకటేష్, పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button