రాయికల్
రాష్ట్ర ఉపన్యాస పోటీలకు ఎంపిక
viswatelangana.com
February 10th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
రాయికల్ ప్రతినిధి: జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని జగిత్యాల లో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలలో రాయికల్ మండలం భూపతిపూర్ ఉన్నత పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న బొడ్డుపల్లి రక్షిత ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయిందని ప్రధానోపాధ్యాయురాలు యు. వి రమణి తెలిపారు రాష్ట్ర స్థాయి కి ఎంపికయినా రక్షిత ను మార్గదర్శనం చేసున్న ఉపాధ్యాయుడు బొల్లె చిన్నయ్య ను సైన్స్ ఉపాధ్యాయులు కలువకోట కార్తిక్ తోట శంకరయ్య లను అభినందిచారు ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు గంగాధర్ మహేష్ తిరుమల గంగారాజాం శ్రీనివాస్ నర్సయ్య పాల్గొన్నారు



