చలో ఇందూరు! పసుపు బోర్డు కేంద్ర కార్యాలయ ప్రారంభానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాక

viswatelangana.com
40 ఏళ్ల నుంచి రైతులు కోరుకుంటున్న పసుపు బోర్డు కల సాకారం కాబోతుంది. ఇందూరు జిల్లాలో పసుపు బోర్డు కేంద్రీయ కార్యాలయం ఏర్పాటు చేయడం పట్ల ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఈ నెల 29వ తేదీన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా ఇందూరుకు రానున్నారు. వారు కేంద్ర కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించి, అనంతరం రైతుల సమ్మేళనంలో బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ రైతులు, ప్రజలు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా 40 ఏళ్ల రైతుల చిరకాల కోరికను నెరవేర్చిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా, ఇందూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ అర్వింద్ ధర్మపురి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ శ్రీ పల్లె గంగారెడ్డి లకు కోరుట్ల నియోజకవర్గం రైతుల తరఫున, ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ పిలుపునిస్తూ, ఇది సామాన్య రైతు గర్వించదగ్గ విజయం. అందరూ భారీ సంఖ్యలో పాల్గొని ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.



