కొడిమ్యాల

చింతలపల్లి గ్రామంలో మెగా ఉచిత వైద్య శిబిరం ఆదిత్య హాస్పిటల్

viswatelangana.com

February 17th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

సోమవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 71 వ జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ పార్టీ కొడిమ్యాల మండల శాఖ ఆధ్వర్యంలోచింతలపల్లి గ్రామంలో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయగా ఆదిత్య హాస్పిటల్, కొడిమ్యాల డాక్టర్ మనోహర్ ఎంబిబిఎస్ రోగులను పరీక్షించగా. ముఖ్య అతిథులుగా సర్పంచుల ఫోరం తాజా మాజీ మండల అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు, బిఆర్ఎస్ పార్టీ కొడిమ్యాల మండల అధ్యక్షుడు పులి వెంకటేష్ గౌడ్ పాల్గొని మందులను, పండ్లను పంపిణీ చేశారుఅనంతరంవారుమాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కొరకు సుదీర్ఘంగా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించి బంగారు తెలంగాణ చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిండు నూరేళ్లుఆయురారోగ్యాలతో ఉండాలని వారు మళ్లీ తిరిగి ముఖ్యమంత్రిగా కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నందున ఆ కొండగట్టు అంజన్న ఆశీస్సులు వారికి ఉండాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ పాదం శ్రీనివాస్, తాజా మాజీ సర్పంచ్ మల్యాల మహిపాల్, గ్రామ శాఖల అధ్యక్షులు కొత్తూరి స్వామి, ఆకునూరి మల్లయ్య, నీలగిరి విద్యాసాగర్ రావు, బోలుమల గంగారాజం, చింతలపల్లి గ్రామ ప్రజలు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Related Articles

Back to top button